సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (16:29 IST)

అధిక బరువు.. తగ్గాలంటే.. వేడినీళ్లే చాలు..

అధిక బరువును తగ్గించుకోవడానికి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారా? ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదా? ఇందుకు ఏమి చేయాలని తలలు పట్టుకుంటున్నారా? వీటి కోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే సరిపోతుంది మరి. 
 
అధిక బరువు త్వరగా తగ్గాలంటే..నిత్యం గోరు వెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. వేడి నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాదు, జీర్ణ సమస్యలు సైతం దూరం అవుతాయి. అజీర్తితో బాధపడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గోరువెచ్చని నీటిని పగటి పూట మాత్రమే కాకుండా నిద్రకు ఉపక్రమించే ముందు కూడా తాగాలి. దీని వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
 
* నిద్రించే ముందుగా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయి, మానసిక ఆందోళన తొలగిపోతుంది. నిద్ర చక్కగా పడుతుంది.
* శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.
* శరీరంలో ఉండేటువంటి విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* అధిక బరువు త్వరగా తగ్గుతారు. అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి.