వేసవిలో నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే...
నిమ్మకాయల్లో శరీరానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. నిమ్మరసంలో దాగి ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో నిమ్మరసం తాగితే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండవచ్చును. నిమ్మరసాన్ని ఎప్పుడో ఒకసారి కాకుండా రోజూ వాడితే శరీరానికి కావలసిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. గ్లాస్ గోరువెచ్చని నీటిలో స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఓసారి తెలుసుకుందాం..
1. అధిక బరువు తగ్గాలనుకునే నిమ్మరసాన్ని వేడి నీటిలో కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాలు శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి.
2. దగ్గు, జబులు, జ్వరం ఉన్నవారు రోజూ పరగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా శరీర వేడిని తగ్గిస్తుంది.
3. కిడ్నీ రాళ్లను కరిగించాలంటే.. ప్రతిరోజూ వేడినీరు, నిమ్మరసం తాగుతుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. దాంతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
4. నిమ్మరసాన్ని వేడినీటిలో కలిపి తాగడం వలన శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలానే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
5. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు తరచు వేడినీటిలో నిమ్మరసం కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వ్యాధి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది.