శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:27 IST)

వేడినీటిని తలపైన పోసుకుంటే..?

వేడి వేడి నీటి స్నానం కంటే స్నానానికి చల్లటి నీరే శ్రేష్టమైనది. నిలువ ఉండే చన్నీరు స్నానానికి పనికిరాదన్నారు. అప్పటికప్పుడు భూమి నుంచి పైకి తెచ్చిన నీరే స్నానానికి శ్రేష్టమైనది. ఇప్పటికాలంలో బావులలో నీరు లేదు కాబట్టి బోరింగ్ వాటర్ అప్పటికప్పుడు కొట్టుకుని స్నానం చేస్తే మంచిది. మొదట నీటిని తలపై పోసుకోవాలి. 
 
ఇలా చేయడం ద్వారా లోపలి వేడి చేతులగుండా పాదాలగుండా వెడలిపోతుంది. మొదట నీటిని పాదాలపై పోసుకోరాదు. అట్లు చేయడం వల్ల శరీరంలో వేడిమి పైకి పొంగి తలలో చేరుతుంది. అందువల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదట తలపైన, అటుపైన పాదాలపైన తర్వాత శరీరంపైన నీటిని పోస్తూ స్నానం చేయాలి.
 
వేడినీటిని తలపైన ఎప్పుడూ పోసుకోరాదు. దానివల్ల ఎంతో కీడు కలుగుతుంది. చాలా వేడిగా ఉన్న నీటిని తలపై పోసుకోవడం ద్వారా కండ్ల జబ్బులు, దృష్టి లోపాలు కలుగుతాయి. తల వెంట్రుకలు రాలిపోతాయి. ఝల్లుమనిపించే చన్నీటితో స్నానం చేయడం వల్ల కఫం ఎక్కువవుతుంది. వాతదోషాలు కలుగుతాయి. మిక్కిలి వేడి నీటి స్నానం చేయడం వల్ల రక్తపిత్తదోషాలు వ్యాపిస్తాయి. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.