అవిసెలు తింటే ఏమవుతుంది..?
అవిసెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం వలన మధుమేహ వ్యాధి నుండి విముక్తి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధిని అదుపు చేయడంలో.. మెదడును చురుకుగా ఉంచడంలో అవిసెలు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవిసెలకు డైలీ డైట్‌లో చోటు కల్పిస్తే గుండె అలిసిపోవడం అనే సమస్యయే ఉందని చెప్తున్నారు.
అవిసెల్లో ఉండె కెమికల్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ.. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటికి ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దప్రేగులోని సమస్యలను నిరోధించగలిగే శక్తి కూడా ఉంది. స్త్రీలకు రుతుక్రమ సమయాల్లో శరీరంలో వేడిని తగ్గించడంలోనూ అవిసెలు విశేషంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పురుషుల్లో వీర్యవృద్ధిని మెరుగుపరచుటకు అవిసె గింజలు ఎంతో దోహదపడుతాయి.
గుండె జబ్బులను అరికట్టడంలో అవిసెలు దివ్యౌషధంగా పనిచేస్తాయని పలు పరిశోధన్లో తేలింది. ఇందులో ఉండే ఫైబర్, మాంగనీస్, విటమిన్ బి1, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు, మతిమరుపు మీ ఛాయలకు రాకుండా చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా అవిసెలు మంచి గుణాన్ని ప్రదర్శిస్తాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలోను ఇవి క్రియాశీల పాత్ర పోషిస్తాయి.