గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (11:55 IST)

గుప్పెడు జామ ఆకులు చాలు... బలాన్నిచ్చేందుకు?

జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్న వారికి జామ ఆకులు చేసే మేలు అంతా ఇంతా కాదు. బి విటమిన్ పుష్కలంగా కలిగి వున్నజామ ఆకులో  వుండే  ఔషధ విలువలు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలే సమస్యను అరికడతాయి. 
 
గుప్పెడు జామ ఆకులను తీసుకొని బాగా మరిగించాలి.
ఆ ద్రావకం చల్లారాక.. జామ ఆకుల రసాన్ని కుదుళ్లకు మృదువుగా పట్టించాలి. తరచుగా యిలా చేస్తుంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తెల్ల జుట్టును అందమైన నల్లటి కురులుగా మారుస్తుంది. 
 
ఆకులలో వుండే విటమిన్ సి ,బి 3,బి 5,బి 6 చర్మాన్ని మెరుగుపరుస్తాయి. పండ్లలో వుండే లైకోపీన్, విటమిన్ ఏ, పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనిచేసే తీరును క్రమబద్దం చేస్తుంది. జుట్టు నెరవాడ్ని ఇది నిరోధిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.