సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 4 మార్చి 2019 (21:08 IST)

వేసవిలో ఆరోగ్యానికి హాని కలిగించే శీతలపానీయం

సాధారణంగా కాలానికి అతీతంగా శీతలపానీయాలను సేవిస్తున్నారు. ముఖ్యంగా.. వేసవి కాలంలో ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్ త్రాగాలని అనుకుంటారు. అయితే, ఈ కూల్‌డ్రింక్స్‌ను సేవించే ముందు.. ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. చల్లటి పానీయం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు. గొంతు, దంతాలు, జీర్ణక్రియపై ఈ చల్లటి పానీయం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
 
1. చల్లటి పానీయాలు అధికంగా తీసుకునేటట్లయితే మీ శరీరం దానిని ఎంతవరకు స్వీకరిస్తుందో ముందుగా మీరు గమనించాలి. 
 
2. సోడాలాంటి పానీయాలను త్రాగేటప్పుడు సిప్ చేస్తూ సేవించరాదు. అలా త్రాగితే దంతాలు తియ్యటి ఆమ్లాలతో దంతాలు పూర్తిగా తడిసి వాటిపై ఉండే ఎనామిల్ పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చల్లటి పానీయాలు త్వరగా సేవించాలంటుంన్నారు. 
 
3. ముఖ్యంగా మీరు ఏ మోతాదులో క్యాల్షియం తీసుకుంటున్నారో తెలుసుకోండి. చల్లటి పానీయాలు మీ ఆహారంలోని క్యాల్షియంను మాత్రమే కాకుండా శరీరంలోనున్న క్యాల్షియంను కూడా హరించివేస్తాయి. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా చల్లని పానీయాలు తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.