బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (15:43 IST)

వేసవి.. ఇన్ఫెక్షన్లకు నిమ్మరసం.. చర్మ సౌందర్యానికి బత్తాయి..

వేసవిలో చర్మ సౌందర్యం కోసం కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు న్యూట్రీషన్లు. దేహంలోని మలినాలను తొలిగించడంలో కీరదోస పాత్ర కీలకం. విటమిన్‌ 'సి' తోపాటు ఇనుము సమృద్ధిగా లభించే పుదీనా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవే కాకుండా బత్తాయి, క్యారెట్‌, అల్లం, తేనెతో తయారుచేసే రసాలు చర్మానికి మేలు చేస్తాయి. 
 
బత్తాయి రోగనిరోధక శక్తిని పెంచితే, అల్లం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. దీంతో చర్మం నిగనిగలాడుతుంది. అలాగే తాజా నిమ్మరసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. నిమ్మరసంతో జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. 'సి' విటమిన్‌ సమృద్ధిగా లభించి చర్మం కొత్త కాంతులీనుతుంది.
 
శరీరం ఎండ ప్రభావానికి గురికాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే సమతులాహారం తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా ఉండటం కోసం తాజా పళ్లు, ఆకుపచ్చని కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. బచ్చలి కూర, దోసకాయ, పుచ్చకాయ, చెర్రీ పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తినటం వల్ల శరీరంలో నీటి పరిమాణం స్థిరంగా ఉండి ఎండదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.