శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (13:19 IST)

నెలకు ఒక్కసారైనా మెడికల్ టెస్ట్ చేయాలి.. లేదంటే..?

మహిళలు నెలకు ఒకసారి మెడికల్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇలాంటి మెడికల్ టెస్ట్స్ విజిట్స్ వలన ప్రాణాంతకమైన వ్యాధుల బారినుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును. కనుక 25 ఏళ్ళు దాటిన మహిళలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటున్నారు వైద్యులు. ఎంత బిజీగా ఉన్నా ఎంతోకొంత సమయాన్ని తమ ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించాలి. మరి మహిళల్లో ప్రాణాంతకంగా మారే కొన్ని వ్యాధులేమిటో ఓసారి పరిశీలిద్దాం...
 
మహిళల్లో 38 శాతం మొదటి హార్ట్ అటాక్ సమయంలోనే మరణిస్తున్నట్లు ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. ముఖ్యంగా ధూమపానం అలవాటు ఉన్న మహిళల్లో హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడి దాని ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 
 
సోషియల్ సిగ్మా వలన చాలామంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అందుకు కారణం డిప్రెషన్, వర్క్ ఫీల్డ్‌లో నిస్సహాయస్థితి, ఇంట్లో, బయటా డామినేటెడ్ పరిస్థితులు ఇందుకు కారణం అవుతాయి. 
 
మహిళల్లో 28 ఏళ్ల తర్వాత్ టైప్ 2 డయాబెటిస్ చాలా సాధారణమైపోయింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని బ్యాలెన్స్ చేయలేనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్ ఓవరీస్‌లో వస్తుంది. మహిళల్లో వచ్చే అత్యంత ముఖ్యమైన క్యాన్సర్ ఇది. ప్రపంచంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఓవేరియన్ క్యాన్సర్‌కు ప్రారంభ చిహ్నాలేవీ లేవు. కనుక తరచు మెడికల్ టెస్ట్ చేయించుకుంటే మంచిది.