బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (14:14 IST)

ఫ్యాబ్రిక్ జువెలరీ వేసుకుంటే..?

నిజానికి అందంగా తయారుచేసిన ఏ నగలు వేసుకున్నా ఆనందంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు టెర్రాకోట లేదా ఫ్యాబ్రిక్‌తో చేసిన నగలు ఎందుకు వేసుకోకూడదు.. ఫ్యాబ్రిక్ జువెలరీని మీ వస్త్రధారణకు ఎలా మ్యాచ్ చేస్తే అందంగా ఉంటుందో చూద్దాం..
 
ఫ్యాబ్రిక్, దారాలతో తయారుచేసే నగల్లో రంగుల హరివిల్లు కనువిందు చేస్తుంది. ఈ జువెలరీని ప్రింటెడ్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లేదా దారాలతో తయారుచేస్తారు. వీటికి సంప్రదాయ, భిన్నమైన లుక్ తేవడం కోసం బంగారం లేదా వెండి పూసలను చేరుస్తారు. 
 
రోజువారిగా వేసుకునేందుకు ఫ్యాబ్రిక్ జువెలరీ బాగుంటుంది. రాత్రి పూట పార్టీలకు వేసుకెళ్లాలంటే మాత్రం బాగా అలంకరించిన లేదా ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్స్ వేసుకోవాలి. సింపుల్ చేనేత చీర కట్టుకుని ఫ్యాబ్రిక్ నెక్లెస్ వేసుకుంటే స్టయిల్ ఐకాన్ మీరే.
 
మిగిలిన నగలతో పోలిస్తే ఇవి తక్కువ ఖర్చుతో కూడినవి. అలానే ప్రయాణాల్లో తీసుకెళ్లడం, మెయుంటెయిన్ చేయడం సులువు. ఫ్యాబ్రిక్ జువెలరీని చాయిస్‌గా ఎంచుకుంటే ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌కి చిరునామా మీరే.