గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (17:32 IST)

భోజనాంతరం ఇలా చేస్తే.. ఏమవుతుందో తెలుసా..?

మంచి పోషకాహారం తీసుకున్నాం అనుకుని.. ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు కారణంగా ఆరోగ్యానికి హానికలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే..
 
భోజనం తిన్న వెంటనే టీ తాగితే జీర్ణమవదు. దాంతో తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. భోజనం చేసే ముందు.. లేదా చేశాక పండ్లు తినకూడదు. ఇలా తినడం వలన పొట్ట పెరుగుతుంది. కనుక రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
 
కొందరైతే తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వలన కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివలన పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. 
 
అన్నం తిన్నాక అరవై అడుగులు వేస్తే నిండు నూరేళ్లు జీవిస్తారని చెప్తుంటారు. కానీ భోజనం చేయగానే నడిస్తే పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తప్పదనుకుంటే గంట తరువాత నడవండి. భోజనం తినగానే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.