ప్రతిరోజూ ఆపిల్ తింటే..?
ఆపిల్‌లో చక్కెర మోతాదు 10 నుండి 50 శాతం వరకు ఉంటుంది. పచ్చి ఆపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. ఆపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
ప్రతిరోజూ ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఆపిల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వలన కిడ్నీలలో రాళ్లు ఏర్పడడాన్ని నివారిస్తుంది. ప్రతి రోజూ ఆపిల్ తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
ఊబకాయం, తలనొప్పి, నిద్రలేమి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగినవారు యాపిల్స్ వాడకూడదు. జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్‌లోని తీపి పదార్థాలను పులిసేలా చేయడం ఇందుకు కారణం. గుండె స్పందనలను క్రమబద్ధీకరించడంకోసం డిగాక్సిన్ వాడే వారు ఆపిల్స్‌ని తీసుకోకపోవడం మంచిది.