శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:14 IST)

బీన్స్ రసంలో కొద్దిగా తైలం కలిపి...?

ఎముకలకు బలాన్నివ్వడంలో బీన్స్ బాగా దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ వంటి పదార్థాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీన్స్‌ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే పలు రకాల రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు. బీన్స్‌తో తయారు చేసిన జ్యూస్ త్రాగితే కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతున్నారు వైద్యులు. బీన్స్ వలన ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 
 
బీన్స్‌ను చిన్న చిన్నవిగా కట్ చేసుకుని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిలో కొద్దిగా ఉప్పు, నీరు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు, కరివేపాకు, కొబ్బరి తురుము, ఎండుమిర్చి పొడి వేసి బాగా వేయించి ఆపై ఉడికించిన బీన్స్ వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఇలా చేసిన వేపుడును గర్భిణులు తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
బీన్స్‌ను కూర రూపంలో తీసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. బాలింతలు పలు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వాటి నుండి ఉపశమనం పొందడానికి బీన్స్ తరచూ తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు దరిచేరవు. బీన్స్‌లోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా సహాయపడుతుంది. అధిక బరువు గలవారు బీన్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి నెలరోజుల్లో స్లిమ్‌గా మారుతారు. 
 
బీన్స్‌లోని గింజలను వేరుచేసి బాగా ఎండబెట్టి తరువాత వాటిని మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి జ్యూస్‌లా చేసుకుని రోజుకో గ్లాస్ తీసుకుంటే శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. 
 
తరచూ తలనొప్పిగా ఉంటే బీన్స్ రసంలో కొద్దిగా తైలం కలిపి నుదిటిపై రాసుకోండి. ఇలా చేస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. చాలామందికి శరీరంలోని ఎముకలు బలాన్ని కోల్పోతుంటాయి. దాని కారణంగా గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కుంటారు. అలాంటి వారు బీన్స్‌తో చేసిన పదార్థాలు సేవిస్తే కండరాలకు బలం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.