అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలిపి తాగితే..?
నిద్ర రాకపోవడం మూలాన అది విపరీతమైన జబ్బులకు దారితీస్తుంది. నిద్ర సక్రమంగా వస్తే రోజంతా హాయిగా పనులు చక్కబెట్టుకోవచ్చు. లేకుంటే తల బరువుగా ఉండడం, ఆవలింతలు రావడం, ఏ పని చేసేందుకు బుద్ధికాకపోవడం, నీరసంగా ఉండడం వంటి తలెత్తుతుంటాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఒత్తిడులు ఉండకూడదు. సమయానుసారం నిద్రకు ఉపక్రమించాలి. దీంతో నిద్ర సరిగా పడుతుందంటున్నారు వైద్యులు.
ఒకవేళ నిద్ర రాకుండా ఇబ్బంది పడుతుంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు మీ కోసం.. అశ్వగంధం, బ్రహ్మీ, శంఖపుష్పం, శతావరి, ముల్హటీ, ఉసిరికాయ, జటామాసి వీటిని ప్రతిదీ 50 గ్రాముల చొప్పున చూర్ణం చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు 3 నుంచి 5 గ్రాములను పాలలో కలిపి తాగాలి. ఒక వారం తర్వాత దీని ప్రభావం చూపిస్తుంది. దీంతో మీరు ఇబ్బంది పడుతున్న నిద్రలేమి దూరమై గాఢమైన నిద్ర పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కాని నిద్రమాత్రలలాగా మైమరిచి నిద్రపోయేలా ఉండదు. అదే ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత ఎంతో ఉల్లాసంగా కనపడతారంటున్నారు వైద్యులు.
అశ్వ గంధం, భంగు ఆకు. ఈ రెడింటిని సమపాళ్ళల్లో కలిపి చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని 3 గ్రాములు లేదా 5 గ్రాములు నీటిలో కలిపి తాగిలి. ఇది ఎలాంటి ఆపద కలిగించదు. రక్త హీనతతో బాధపడుతున్నవారిలో నిద్రలేమి ప్రభావం ఉందని తరచూ చెబుతుంటారు. అలాంటి వారు ఈ చూర్ణాన్ని తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.