శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శనివారం, 22 జూన్ 2019 (15:25 IST)

వరల్డ్ కప్ : టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ వికెట్ డౌన్

ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం భారత్ క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టగా, జట్టు స్కోరు ఏడు పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. పది బంతులు ఎదుర్కొన్న రోహిత్ కేవలం ఒక్క పరుగు చేసి రహ్మాన్ బౌలింగ్‌లో ముజీబ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
ప్రస్తుతం క్రీజ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 5.3 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 13/1గా ఉంది. ఈ మ్యాచ్ సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతోంది. ఇక్కడి వాతావరణం, పిచ్‌... బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
కాగా, టీమిండియాలో ఓ మార్పు చోటుచేసుకుంది. గాయంతో బాధపడుతున్న కొత్తబంతి బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహ్మద్ షమి బరిలో దిగాడు. భారత జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలతో కొనసాగుతుండగా, ఆఫ్ఘనిస్థాన్ జట్టు 5 మ్యాచ్‌లు ఆడి అన్నింట్లోనూ ఓటమిపాలైంది.
 
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో కేఎల్ రాహుల్, రోహిత్, విజయ్ శంకర్, కోహ్లీ, ధోనీ, పాండ్యా, జాదవ్, కుల్దీప్, షమీ, చాహల్, బుమ్రాలకు చోటు కల్పించారు. అలాగే, ఆప్ఘాన్ జట్టులో జాజై, నబీబ్, షా, షాహిది, ఆప్ఘాన్, మొహ్మద్ నబీ, జర్దాన్, అలిఖిల్, రషీద్ ఖాన్, ఆలమ్, రెహ్మాన్‌లు ఉన్నారు.