శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (19:14 IST)

సచిన్‌ను వెంటాడుతున్న కోహ్లీ... ఇదేం బాగోలేదంటూ కన్నెర్ర!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెంటాడుతున్నారు. దీంతో సచిన్ భయంతో వణికిపోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు తన పేరున లిఖించుకున్నాడు. అయితే, ఇపుడు ఈ రికార్డులకు ఓ భారత క్రికెటర్ అడుడే చెరిపివేస్తాడని సచిన్ కలలో కూడా ఊహించివుండరు. కానీ, సచిన్ కళ్ల ముందే ఆ రికార్డులన్నీ మాయమైపోతున్నాయి. 
 
ఆ రికార్డులను తుడిసిపెడుతున్నది ఎవరో కాదు.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత పరుగుల యంత్రంగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ నిన్నటికి నిన్న వన్డేల్లో వేగంగా అత్యంత 11 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. ఇపుడు మరో రికార్డును బద్ధలుకొట్టేందుకు సిద్ధమయ్యాడు. 
 
ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ పోటీలు ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 104 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 20 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
 
ప్రస్తుతం కోహ్లీ తన కెరీర్‌లో 415 ఇన్నింగ్స్ (131 టెస్టులు, 222 వన్డేలు, 62 టీ-20లు) ఆడాడు. అయితే ప్రస్తుతం ఈ రికార్డు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట సంయుక్తంగా ఉంది. 
 
వీరు 20 వేల పరుగులను 453 ఇన్నింగ్స్‌లో చేశారు. ఆ తర్వాత 468 ఇన్నింగ్స్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకొని.. ఆసీస్ క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే విరాట్ సచిన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో 11 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు.