విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న ఊర్వశీ రౌతాలా.. అనుష్క శర్మ ఏం చేస్తుందో?

Last Updated: బుధవారం, 19 జూన్ 2019 (14:46 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కోహ్లీని నటి ఊర్వశీ రౌతాలా కౌగిలించుకున్న ఈ ఫోటోను ఊర్వశీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరలై కూర్చుంది. పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత కోహ్లీతో దిగిన ఫోటోను.. ఊర్వశి నెట్టింట షేర్ చేయడంతో చాలామంది ఫ్యాన్స్.. కెప్టెన్ సతీమణి అనుష్క శర్మకు జోడిస్తూ.. వేలాది కామెంట్లు చేస్తున్నారు. 
 
"అనుష్కా నువ్వు ఎక్కడ ఉన్నావో?" అని ఒకరు "నీ ఫోన్ చూసుకో" అని కొందరు వెరైటీ వెరైటీగా కామెంట్లు చేస్తున్నారు. కానీ అసలు సంగతి ఏంటంటే.. ఊర్వశి కౌగిలించుకున్నది విరాట్ కోహ్లీని కాదు. ఆయన మైనపు విగ్రహాన్ని మాత్రమే. విగ్రహాన్ని కౌగిలించుకున్న ఊర్వశి, దాని బ్యాక్ గ్రౌండ్‌ను మార్ఫింగ్ చేసి ఫొటోను పోస్ట్ చేసింది. 
 
ప్రస్తుతం ఊర్వశీ ఫోటో సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంటే.. చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్థాన్‌పై ఘన విజయం అనంతరం.. విరాట్ కోహ్లీ ఎంచక్కా భార్యతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. టీమిండియా సభ్యులు లండన్‌ వీధుల్లో సందడి చేస్తున్నారు. 
 
పదిహేను రోజులపాటు భార్యా పిల్లలతో గడిపేందుకు బీసీసీఐ అనుమతించడంతో కెప్టెన్‌ కొహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తదితరులు తమ భార్యా, పిల్లల్ని వెంటేసుకుని సరదాగా గడుపుతున్నారు. 
 
లండన్‌లోని ఓల్డ్‌బాండ్‌ స్ట్రీట్‌లో కొహ్లీ, అనుష్క జంట కనిపించడంతో అభిమానులు తమ కెమెరాలకు పనిచెప్పారు. రోహిత్‌, ధావన్‌లు కుటుంబాలతో గడుపుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.దీనిపై మరింత చదవండి :