శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (11:27 IST)

మ్యాచ్‌ టిక్కెట్లు అడిగితే ఇంట్లో కూర్చుని టీవీల్లో చూడమంటాం.. (video)

మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా పాకిస్థాన్ జట్టుపై ప్రపంచ కప్‌లో ఏడోసారి వరుసగా విజయాన్ని సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.


ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో టీమిండియా ఆడే టిక్కెట్లు దొరకడం అంత సులభం కాదని.. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు కావాలని అడిగేవారిని సంబాళించడం అంత సులభం కాదని.. టీమిండియా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై నవ్వుతూ బదులిచ్చాడు. 
 
ఇంకా కోహ్లీ మాట్లాడుతూ.. రెండు లేదా మూడు టిక్కెట్లు మాత్రమే తమ కుటుంబాలకు తాము పొందగలుగుతామని, పాస్ టిక్కెట్లను చాలామంది కోరుతుంటారని.. వారికి సర్దిచెప్పడం అంత సామాన్యమైన పనికాదని.. ఏవో తంటాలు పడి ఒకరికి పాస్ టిక్కెట్లు తీసిపెడితే ఆ విషయం ఆ వ్యక్తి నుంచి ఇంకొకరికి చేరుతుందన్నాడు.

దీంతో అంతమందికి పాస్ టిక్కెట్లు తీసివ్వడం కుదరదన్నాడు కోహ్లీ. అందుకే స్నేహితులు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను చూడాలని పాస్ టిక్కెట్లు అడిగితే.. ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా టీవీల్లో మ్యాచ్ చూడమని ఉచిత సలహా ఇస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు.