పాకిస్థాన్ తప్పులపై తప్పులు చేసింది.. సలహా ఇవ్వడం మానేశా : వసీం అక్రమ్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు తప్పులపై తప్పులు చేస్తోందని, అందువల్ల ఆ జట్టుకు సలహాలు ఇవ్వడం మానేశానని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజండ్రీ క్రికెటర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం మాంచెష్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత క్రికెట్ జట్టు ఓడించింది.
దీనిపై వసీం అక్రమ్ స్పందిస్తూ, పాక్ జట్టుకు సలహాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయానన్నాడు. మాంచెస్టర్‌లో భారత్‌పై పాక్ ఓడిన చాలా బాధాకరమన్నారు. అసలు ఈ మ్యాచ్ కోసం అయిదుగురు స్పెషలిస్టు బౌలర్లతో మ్యాచ్‌కు వెళ్తున్నప్పుడే.. టాస్ గెలిచిన తర్వాత ఎలా బౌలింగ్‌ను తీసుకున్నారని వసీం ప్రశ్నించాడు.
మాంచెస్టర్ వన్డేలో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో పాక్ అయిదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగింది. పాక్ చేస్తున్న తప్పులను చూసి ఆ జట్టును విమర్శించడం మానేసినట్లు చెప్పాడు.
అయిదుగురు బౌలర్లు ఉన్నారంటే, ఓ స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ను మనం మిస్సవుతున్నామన్నట్లే, అలాంటి సమయంలో బౌలింగే మన బలం, అప్పుడు మనం టార్గెట్ ఇచ్చి డిఫెండ్ చేయాలన్నాడు. ఇలాంటి సలహాలు ముందు నుంచే ఇచ్చానని, కానీ పాక్ జట్టు తన సలహాలను స్వీకరించలేదని, అందుకే సలహాలు ఇవ్వడం మానేసినట్టు చెప్పారు.