సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (12:58 IST)

జీవా ధోనీ గోలగోల.. పాకిస్థాన్‌ను భలే ట్రోల్ చేసిన ముంబై పోలీసులు (Video)

ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. మాంచెస్టర్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ సందర్భంగా తుది జట్టులో స్థానం సంపాదించుకోలేక పోయిన రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవాతో కలిసి గోలగోల చేశాడు. మ్యాచ్ జరుగుతున్న వేళ, వీరిద్దరూ గట్టిగా అరుస్తూ.. ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
 
ఆ వీడియోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అదిప్పుడు వైరల్ అయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో, అతని స్థానంలో రిషబ్ బ్రిటన్‌కు వెళ్లి జట్టులో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి జట్టులో రిషబ్‌కు దక్కకపోవడంతో జీవా ధోనీతో కలిసి గోల చేస్తూ గడిపాడు.
 
మరోవైపు.. భారత్-పాక్ మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందు భారత జట్టుకు మద్దతుగా పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తూ ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. పాక్ జట్టు జెర్సీ రంగు అయిన గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను పోస్టు చేసిన పోలీసులు.. ''భారత్‌కు గ్రీన్ కనిపిస్తోంది. మీరెప్పుడూ చేసినట్టుగానే యాక్సిలరేటర్‌ను నొక్కిపట్టండి. హద్దుల్లేకుండా దూసుకెళ్లండి’’ అంటూ ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. పాకిస్థాన్‌ను భలే ట్రోల్ చేశారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Partners in crime