శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (19:43 IST)

మైదానంలో రైనా చేసిన పనికి అంతా 'ఫిదా'(Video)

సురేష్ రైనా షూలేస్ కట్టాడు. ఇందులో పెద్ద గొప్పేముందీ... అందరం కట్టుకుంటాం కదా అనుకునేరు. కానీ సురేష్ రైనా కట్టింది తన ప్రత్యర్థి జట్టు ఆటగాడికి. మైదానంలో వాళ్లిద్దరూ ప్రత్యర్థులైనా వెలుపల క్లోజ్ ఫ్రెండ్స్.

ఇక అసలు విషయానికి వస్తే నిన్నటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా అతడి షూ లేస్ ఊడిపోయింది. దీనితో క్రీజుకు సమీపంలో వున్న సురేష్ రైనా దీన్ని గమనించి... అక్కడికి వచ్చి పంత్ షూ లేస్ కట్టాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. మీరూ చూడండి.