శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 3 మే 2019 (21:06 IST)

రోడ్డు మీద కదిలే బైకుపై ఎదురుగా ప్రేయసి వాటేసుకుంటే సర్రుమంటూ...

పిచ్చి ముదిరి వెర్రితలలు వేయడం అంటే ఇదేనేమో. ఇప్పటికే వెరైటీ సెల్ఫీలు అంటూ కొంతమంది ప్రేమజంటలు ప్రాణాల మీదికి తెచ్చుకోగా... ఇప్పుడు ఏకంగా ఓ ప్రేమజంట రద్దీగా వున్న రోడ్డుపైన కదిలే బైకుపైనే ప్రేమకలాపాలు సాగిస్తూ సర్రుమంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు యువతి బైకు ఆయిల్ ట్యాంకుపై కూర్చొని ఎదురుగా అతడిని కౌగలించుకుంది.
 
ఆ జంట ఢిల్లీ రాజౌరీ గార్డెన్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న రోడ్డుపైనే బైక్ పైన దూసుకుపోతూ తమ రొమాన్స్‌ని చూపించేశారు. కాగా వారిపై ఎలాంటి చర్య తీసుకున్నారన్న మాట అటుంచి నెటిజన్లు వారలా బైకుపై ఒకరికొకరు అతుక్కుపోయి వెళ్లడాన్ని చూసి కొందరేమో హీరో ఆమిర్ ఖాన్, హీరోయిన్ రాణి ముఖర్జీలా వెళ్లారంటే, మరికొందరేమో యే క్యా రొమాన్స్ హై అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. చూడండి వీడియో...