గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 2 మే 2019 (19:01 IST)

పెళ్ళి చేసుకుని నెలరోజులే... రోడ్డు ప్రమాదంలో నవదంపతులు..

పెళ్ళై నెల రోజులే. ఇంట్లో వివాహ సందడి తీరలేదు. కొత్త జీవితంలోని ఎత్తుపల్లాలను ఎరుగలేదు. అంతలోనే వారిని మృత్యువు మింగేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ చంపేసింది. చిత్తూరు జిల్లా వి.కోట మండలం వీభూది ఎల్లాగరం గ్రామానికి చెందిన అశోక్, అశ్విని దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 
 
ఎదురుగా వస్తున్న పెట్రోలియం ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నవ దంపతుల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అశోక్, అశ్వినిలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.