బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (10:34 IST)

బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తూ 270 మంది చనిపోయారు...

ఇండోనేషియా దేశంలో 270 మంది చనిపోయారు. ఈ దేశంలో ఎలాంటి ప్రకృతివిపత్తు సంభవించలేదు. ఎలాంటి సునామీలు రాలేదు. కానీ, 270 మంది మృత్యువాతపడ్డారు. దీనికి కారణం.. చనిపోయిన వారంతా బ్యాలెట్ ఓట్లను లెక్కించడమే. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా కూడా ప్రకటించింది. 
 
ఇటీవల ఇండొనేషియాలో అధ్యక్ష పదవికి సంబంధించి ప్రాంతీయ, జాతీయ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 26 కోట్ల మంది ఉన్న జనాభాకు ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. దాదాపు 19 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఇండోనేషియాలో 80 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
మే 22న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో.. ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో కౌంటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో అలసటకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వందలాది సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇండోనేషియా ఎన్నికల సంఘం అధికారుల లెక్కల మేరకు... ఇప్పటివరకు మొత్తం 272 మంది ఎన్నికల సిబ్బంది చనిపోగా, 1,878 మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు.