శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 22 ఏప్రియల్ 2019 (20:49 IST)

చూడు చూడు నా సూసైడ్ అంటూ సెల్ఫీ... తమాషా చేయబోయి తనువే చాలించాడు...

తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఒక యువకుడు ఆకతాయిగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దామినేడు గృహాల్లో మెకానిక్‌గా ఉన్న ఇరవై ఆరేళ్ళ  శివకుమార్ ఈరోజు ఉదయం తన ఇంటిలో పూటుగా మద్యం సేవించాడు. 
 
తన స్నేహితుడుకి సెల్ఫీ వీడియో కాల్ చేసి ఆత్మహత్య  చేసుకుంటున్నా చూడు అంటూ ఫ్యాన్‌కు ఉరేసుకుని మంచంపై నిలబడ్డాడు. తన స్నేహితుడు తమాషా చేస్తున్నానుకున్నాడు.. శివ కుమార్ కూడా తన స్నేహితుడిని ఆటపట్టించడానికి అలా చేశాడు. కానీ ఫ్యాన్‌కు చీర ఉరేసుకున్న సమయంలో అది మెడకు గట్టిగా పట్టుకుంది. దీంతో ఊపిరాడక శివకుమార్ చనిపోయాడు.