సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (13:09 IST)

నాగిని అలా బికినీలో కనబడితే? (Viral Video)

బాలీవుడ్ పాపులర్ షో నాగిని సీరియల్‌లో నటిస్తున్న మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హిందీలో రూపుదిద్దుకున్న నాగిని ఆపై ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగ్ చేయించుకుని ప్రసారం అవుతోంది. దీంతో మౌని రాయ్‌కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ భారీగానే వున్నారు. బుల్లితెర ద్వారా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో ''బ్రహ్మాస్త్ర'' అనే సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి మౌని నటించింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. తాజాగా నాగిని స్టార్ మౌని రాయ్ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫోటోలే కాదు.. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
వేసవి వేడిమి తట్టుకోలేక ఎక్కడకో విదేశాలకు జక్కేసిన మౌని రాయ్ అక్కడ స్విమ్ చేస్తూ హాయిగా గడుపుతోంది. అలా స్విమ్మింగ్ కోసం అమ్మడు ధరించిన బికినీ ఫోటోలు, వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇవి కాస్తా వైరలై కూర్చున్నాయి. దీంతో మౌని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంకేముంది.. మౌని రాయ్ బికినీ అందాలను మీరూ ఓ లుక్కేయండి.