ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (13:26 IST)

కస్టమర్లతో అలా నడుచుకోలేదని.. బార్ డ్యాన్సర్‌పై దాడి..

హైదరాబాద్ నగరంలో పబ్‌ల వ్యవహారం శృతి మించుతోంది. కస్టమర్లతో లైంగికంగా కలిసేందుకు నిరాకరించినందుకు బార్ డాన్సర్లపై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కొన్ని నెలల క్రితం నగరంలోని బాగంపేట ప్రాంతంలో ఒక పబ్‌లో డ్యాన్సర్‌గా చేరింది.


తెలంగాణ, హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో శృంగారానికి నో చెప్పడంతో బార్ డాన్సర్‌ను కొట్టడం చేశారు. బార్ డ్యాన్సర్‌పై దాడి చేసిన ఆరోపణలతో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నగరంలోని బేగంపేట ప్రాంతంలో ఒక పబ్‌లో నర్తకిగా చేరిన మహిళపై బార్ యాజమాన్యం కస్టమర్ల వద్ద లైంగిక కార్యకలాపాలు చేయాల్సిందిగా  వేధించడం ప్రారంభించిందని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

అయితే డ్యాన్సర్ కస్టమర్ల డిమాండ్‌ను తిరస్కరించడంతో నలుగురు మహిళతో పాటు ఓ వ్యక్తి కూడా బార్ డ్యాన్సర్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా డ్యాన్సర్‌పై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.