ఒకప్పటి వెస్టిండీస్‌ను తలపిస్తున్న కోహ్లీ సేన : శ్రీకాంత్
ప్రస్తుత భారత క్రికెట్ జట్టు రాణిస్తున్న తీరుపై స్వదేశీ, అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ జట్టు పేరు వింటేనే ప్రత్యర్థి క్రికెటర్ల వెన్నులో వణికిపోతున్నారంటూ పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుత భారత క్రికెట్ జట్టుపై మాజీ క్రికెటర్ కృష్ణమారి శ్రీకాంత్ స్పందిస్తూ, వరుస విజయాలతో దూకుడుమీదున్న భారత్.. ఒకప్పటి వెస్టిండీస్ జట్టును తలపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, 1970-80ల్లో వెస్టిండీస్ జట్టును చూస్తేనే ప్రత్యర్థులు భయపడిపోయేవారు. ప్రస్తుతం టీమిండియా కూడా అలాంటి స్థితిలోనే కనిపిస్తోందన్నారు.
ప్రస్తుతం సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ ఈవెంట్‌లోనే కాకుండా, ఇతర మ్యాచ్‌లలో కూడా విరాట్ సేనతో పోరు అంటేనే ప్రత్యర్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇక పాక్‌పై విజయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా ప్రధాన పాత్ర పోషించారన్నారు.