సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (13:26 IST)

విరాట్ కోహ్లీని కాపీ కొడుతున్న పాకిస్థాన్ క్రికెటర్.. ఎవరు?

''నేను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే వీడియోలను చూసి శిక్షణ తీసుకుంటున్నాను'' అని ఓపెన్‌గా చెప్పేశాడు.. పాకిస్థాన్ క్రికెటర్ అజామ్. ప్రపంచ కప్ పోటీలు అంటేనే క్రికెట్ ఫ్యాన్సుకు పండగే.


ఇంకా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీవీలకు అతుక్కుపోతారు. 
 
ఇక ఉత్కంఠభరితంగా, నరాలు తెగే కసితో జరిగే ఈ మ్యాచ్‌ ఆదివారం ఓల్ట్ మైదానంలో జరుగనుంది. ప్రపంచకప్ పోటీల్లో భాగంగా జరిగే ఈ ఇండో-పాక్ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి. భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గే అవకాశాలు ఎక్కువగా వున్నాయని క్రీడా పండితులు అంటున్నారు. 
 
ఇక పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేమంటున్నారు. ఇంతవరకు ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియాపై గెలుపును నమోదు చేసుకోలేకపోయామనే ఆందోళన, కసితో పాకిస్థాన్ క్రికెటర్లు బరిలోకి దిగేందుకు సిద్ధంగా వున్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ వీడియోలను చూసే శిక్షణ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. బౌలర్లను ఎదుర్కొనే సామర్థ్యం, కోహ్లీ బ్యాటింగ్ స్టైల్‌ను చూసి చాలా నేర్చుకుంటున్నానని తెలిపాడు. ఆయన బ్యాటింగ్ స్టైల్ అద్భుతంగా వుందని కితాబిచ్చాడు.