శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (12:23 IST)

భారత్ చేతిలో పాకిస్థాన్ ఎందుకు ఓడిపోయిందంటే.. సచిన్ కామెంట్స్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో గత ఆదివారం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డక్వర్త్ లూయీస్ పద్దతి మేరకు 89 పరుగుల తేడాతో భారత్ విజయభేరీ మోగించింది. ఈ విజయంపై భారత క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే, పాకిస్థాన్ ఓటమికి గల కారణాలను కూడా మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ ఓటమికి గల కారణాలను వివరించారు. భారత్ పాక్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్ తికమక పడ్డాడని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సర్ఫరాజ్ గందరగోళానికి గురైనట్లు కనిపించిందన్నారు. 
 
అదేసమయంలో పేసర్ వహబ్ రియాజ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచకుండా షార్ట్ మిడ్‌వికెట్‌లో ఫీల్డర్‌ను నిలబెట్టాడనీ, అలాగే, షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పెట్టాల్సిన చోట ఫీల్డర్‌ను పెట్టకుండా స్లిప్‌లో ఫీల్డర్ పెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. 
 
అయితే, అత్యంత కీలకమైన దాయాదుల సమరంలో ఇలాంటి చిన్నచిన్న తప్పిదాలు కూడా ఫలితంపై ప్రభావం చూపుతాయన్నారు. బంతి మూవ్ కాని తరుణంలో పదే పదే ఓవర్‌ది వికెట్ బౌలింగ్ చేసిన వహాబ్.. ఆఖర్లో అరౌండ్ ది వికెట్‌కు మారినా అప్పటికే చాలా ఆలస్యమై జరగాల్సిన నష్టం జరిగిపోయిందని సచిన్ టెండూల్కర్ విశ్లేషించారు.