గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (18:36 IST)

రో"హిట్".. 'సరిలేరు నీకెవ్వరు'...

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ టోర్నీలో విశ్వవిజేతగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. అయితే, భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం అద్భుతంగా రాణించాడు. ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. ఒకే టోర్నీలో ఐదు సెంచరీలు, ఓ అర్థ సెంచరీలతో 648 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. పైగా, రోహిత్ శర్మ సగటు 81 శాతంగా ఉంది. 
 
అయితే, క్రికెట్ వరల్డ్ కప్ తన ట్విట్టర్‌ పేజీలో టాప్‌-5 స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా), మూడోస్థానంలో షకీబుల్‌ హసన్‌ (బంగ్లాదేశ్), నాలుగో స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్), ఐదో స్థానంలో జోయి రూట్‌ (ఇంగ్లండ్)లు ఉన్నారు. 
 
ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్‌ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్‌ వార్నర్‌ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్‌ తరపున అద్భుతంగా ఆడిన షకీబుల్ హసన్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్ 578 పరుగులతో నాల్గో స్థానంలో, జూ రూట్ 556 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు.