మెగాస్టార్ చిరంజీవిని డాడీ అంటున్న తమన్నా... (video)

Chiru-Tamanna
జె| Last Updated: సోమవారం, 30 సెప్టెంబరు 2019 (19:34 IST)
సైరా నరసింహారెడ్డి సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిల్కీబ్యూటీ తమన్నా ఈ సినిమాలో నటించింది. ఆమె కీలకమైన పాత్రను పోషించింది. నయనతార క్యారెక్టర్‌కు ఉన్న ప్రయారిటీ తమన్నా క్యారెక్టర్‌కు ఉందంటున్నారు దర్శకుడు సురేంద్రరెడ్డి.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవితో కలిసి చెన్నైకు వెళ్ళింది తమన్నా. ప్రత్యేక విమానంలో చిరు, తమన్నాలు ఇద్దరూ కలిసి వెళ్ళారు. అయితే చిరంజీవిని సర్ అని సంబోధిస్తూ పిలిచే తమన్నా.. ఒక్కసారిగా డాడీ అనేసిందట. దీంతో చిరంజీవి ఆశ్చర్యపోయి చూశారట.

సారీ సర్... ఎందుకో అలా వచ్చేసింది అందట మిల్కీ బ్యూటీ తమన్నా. ఫర్వాలేదు తమన్నా.. నేను తండ్రిలాంటి వాడినే అని చిరంజీవి చెప్పారట. గతంలో కాజల్ కూడా చిరంజీవితో కలిసి నటించినప్పుడు ఇలాగే చెప్పినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :