సమంతకు సద్గురు ఆశీర్వాదం.. లక్ష్యాన్ని మించి సాధించాలని..

Last Updated: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:04 IST)
సినీనటి సమంతకు సద్గురు ఆశీర్వాదం లభించింది. కావేరీ పిలుస్తోంది పేరిట మొక్కలు నాటే ఉద్యమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో అగ్రశ్రేణి సినీ నటి కూడా పాలుపంచుకుంటున్నారు.

సమంత లక్ష మొక్కలు నాటేందుకు నడుంబిగించారు. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులను కూడా కావేరీ పిలుస్తోందిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. దీనిపై సద్గురు ట్విట్టర్‌లో స్పందించారు. ప్రియమైన సమంత, కావేరి పిలుస్తోంది కోసం నువ్విచ్చిన పిలుపుతో ఎంతోమంది యువతీయువకులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రతువులో సమంత పాలుపంచుకోవడం సంతోషంగా వుందని.. లక్ష్యాన్ని మించి ఇంకా రాణించాలని సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా సమంత సఫలం కావాలని కోరుకుంటున్నట్లు సద్గురు ఆశీర్వదించారు. భవిష్యత్ తరాలకు మనం అందించే అత్యుత్తమ బహుమతి ఇదే" అంటూ ట్వీట్ చేశారు. సద్గురు మొత్తం 242 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించుకున్న సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :