తమిళనాట "జయ"హోరే
|
మరోవైపు ఆకాశన్నంటిన నిత్యావసర వస్తు ధరలు, శ్రీలంకలో తమిళుల సమస్య, రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్తు కోతలతో ప్రజలు పూర్తిగా పాలకపార్టీపై విసుగెత్తిపోయారని పలు సర్వేలు చెపుతున్నాయి.
పురుచ్చితలైవిగా తమిళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జయలలిత ఎక్కడికక్కడ తన ప్రసంగపు వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తనకు ఏ కుటుంబ బాంధవ్యాలు లేవనీ, పాలకపార్టీ నాయకుని కుటుంబంలోని సభ్యులకు పదవులతోపాటు వ్యాపారాలు కట్టబెట్టాలని, ఈ క్రమంలో పాలకపార్టీ పూర్తిగా బంధువుల బాగోగుల తప్పించి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
హామీల విషయానికొస్తే.... శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక ప్రాంతం, కేంద్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఆరు లక్షల పోస్టులు భర్తీ, తపాలా శాఖలో తాత్కాలికంగా పనిచేస్తున్న 3 లక్షల మందిని పర్మినెంట్, చెరకు మద్దతు ధర వంటివెన్నో ఉన్నాయి.
మొత్తమ్మీద చూస్తే జయలలిత సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే లోక్‌సభ ఎన్నికలలో జయలలిత అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

