1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-12-2019 ఆదివారం మీ రాశి ఫలితాలు

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
వృషభం: వేళకాని వేళ భుజించటం వలన ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సతీసమేతరంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరన్న వాస్తవం గ్రహించండి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
మిథునం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. అందరిత కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సంఘంలో  మంచి గుర్తింపు లభిస్తుంది. రవాణా రంగాల్లోని వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
కర్కాటకం :  రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. 
 
సింహం :  వస్త్ర, గృహోపకరణ వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతారు. కొంత మొత్తం చెల్లించి రుణ దాతలను సంతృప్తిపరుస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. 
 
కన్య :  మత్స్యకోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వేడుకలు, దైవ కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వూలలో విజయం పొందుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మిమ్మలను పొగిడే వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. 
 
తుల : విందులలో పరిమితి పాటించండి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు.  వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. మీ చెంత ధనం వుందన్న విషయాన్ని గోప్యంగా వుంచండి.  ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికమవుతుంది. 
 
వృశ్చికం : స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. భాగస్వామికంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త స్కీములు అమలు చేస్తారు. పత్రికా సిబ్బందికి విశ్రాంతి లోపం, పనిభారం అధికం. లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. దుబారా ఖర్చులు అదుపు చేయగలుగుతారు. 
 
ధనస్సు : ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు లాభాలనిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతారు. 
 
మకరం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగువేయవలసివుంటుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. 
 
కుంభం :  స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వూ సమాచారం అందుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ అవసరాలు ఏదో విధంగా నెరవేరగలవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. 
 
మీనం : ద్విచక్ర వాహన చోదకులకు చికాకులు తప్పవు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి సలహా ప్రకారమే నడుచుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. వేడుకలు, వన సమారాధనల్లో పాల్గొంటారు.