మేషం : భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాబడికి మంచిన ఖర్చులు వల్ల ఒకింత ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవడం క్షేమదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : ప్రైవేటు, పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి...