1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 02-06-2025 Your Daily Horoscope

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

Horoscope nakshatra
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రయాణంలో తోటివారితో జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. రుణవిముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒత్తిడికి గురికావద్దు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థలు ఎదుర్కుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. పనులు పురుమాయించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యసాధనకు పట్టుదలతో శ్రమించండి. ఖర్చులు విపరీతం. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కష్టించినా ఫలితం ఉండదు. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. రుణ సమస్య కొలిక్కివస్తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
About Writer
రామన్
తర్వాతి కథనం
Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?