1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-04-2023 శుక్రవారం రాశిఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు నెరవేరుతాయి..

Virgo
మేషం :- వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. రుణయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
వృషభం :- సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కాగలవు. ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 
 
మిథునం :- మార్కెటింగ్ రంగాలవారికి, ఉపాధ్యాయులకు మార్పులు అనూలిస్తాయి. కాంట్రాక్టర్లకు టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం. ఆదాయ వ్యయాలలో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. 
 
కర్కాటకం :- స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. పని చేసే చోట కొన్ని మార్పులు సంభవిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. క్రయ విక్రయాలు లాభదాయకం. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
సింహం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. ఎప్పటి నుంచో మీరుకంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడనుంది. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు.
 
కన్య :- నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో బహుజాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం.
 
తుల :- స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ప్రతికూలు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్యల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. ఉద్యోగస్తులకు పనిభారం, అధిక ఒత్తిడి తప్పదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.
 
మకరం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. వృత్తి, వ్యాపారాలలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది.
 
కుంభం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులు చెప్పిన మాటపై దృష్టిపెట్టకండి. చిన్న తరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాణిజ్య ఒప్పందాలు, వ్యవహరాలు వాయిదా వేయటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు.