1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 15-08-2023 Daily Horoscope

15-08-2023 మంగళవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...

simha raasi
మేషం :- వృధా ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఆరోగ్యభంగం, ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. గృహ మరమ్మతులు, నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత, మెళుకువ ముఖ్యం.
 
వృషభం :- ఆర్ధిక విషయాలలోజయం చేకూరుతుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైనపరికరాలు అమర్చుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే కోరిక వాయిదా వేసుకోవలసి వస్తుంది. కమీషన్‌దారులకు, మధ్యవర్తులకు ఆదాయం బాగుంటుంది.
 
మిథునం :- విద్యార్థులు బహుమతులను స్వీకరిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉపాధ్యాయులకు పని భారం అధికమవుతుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది. 
 
కర్కాటకం :- రావలసిన ధనం చేతికందుతుంది. బంధుమిత్రుల కలయితో మానసికంగా కుదుటపడతారు. చేయు వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్ చాతుర్యం ఉండును. మీకళత్ర మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. కీలకమైన వ్యవహారాలలో మెళకువ వహిస్తారు. సోదరీ, సోదరులతో సమస్యలు తలెత్తుతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. రవాణా రంగాలవారికి ఇబ్బందులు అధికమవుతాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి.
 
కన్య :- ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనువుతారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
తుల :- స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. శతృవులపై విజయం సాధిస్తారు. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు గౌరవం లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. ఓర్పుతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. గృహమునకు వస్తువులను అమర్చుకుంటారు. దైనా శుభకార్యం చేయాలనే సంకల్పం బలపడుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. విద్యార్థినులకు ఒక విషయం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అవివాహితులకు ఒక వార్త ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
మకరం :- విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు కోరుకునే మార్పులు త్వరలోనే అనుకూలించగలవు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది.
 
కుంభం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరించగలుగుతారు. దూర ప్రయాణాలలో ఊహించని ధననష్టం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.
 
మీనం :- ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మాసికంగా కుదుటపడతారు. ఋణం తీర్చటానికై చేయుయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడికానవస్తుంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. ప్రేమ వ్యవహారాలపట్ల ఆసక్తి కనబర్చటంవల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. 
About Writer
రామన్
తర్వాతి కథనం
శ్రావణ అమావాస్య పూజా ఫలితం.. అప్పులు తీర్చుకుంటే..?