శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (22:39 IST)

15-08-2024 గురువారం దినఫలాలు - లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి..

Astrology
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు॥ దశమి ఉ. 6.04 జ్యేష్ఠ ఉ.9.54 సా.వ.6.04 ల 7.42. ఉ.దు. 9.58 ల 10.49 ప.దు. 3.05 ల3.57
 
మేషం :- లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
 
వృషభం :- చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా నివారించలేకపోవడం వల్ల అశాంతి అధికమవుతుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేనివారు అధికమవుతున్నారు అని గమనించండి.
 
మిథునం :- తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవకాకర్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు.
 
కర్కాటకం :- ఒక్కోసారి అతి మొండివైఖరి అవలంభించడం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. వైద్యులకు ఏకాగ్రత అవసరం.
 
సింహం :- రుణాలు, చేబదుళ్ళు స్వీకరించవలసివస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. తలపెట్టిన పనులు అర్థాంగా ముగిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది.
 
కన్య :- రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది. కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరచటానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కుంటారు.
 
తుల:- ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి. విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, కార్మికులు, నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
వృశ్చికం :- ఇంజనీరింగ్ రంగాల్లో వారికి, బిల్డర్లకు ఒత్తిడి, చికాకు అధికం అవుతుంది. మీ సంతానం పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు.  సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారికి పనిభారం అధికమవుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు బాగా కలిసివస్తాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. అపార్థాలుమాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. రాజకీయ రంగంలోని వారికి ఆర్యోగ్యలోపం, అధిక శ్రమ ఉంటాయి.
 
కుంభం :- రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవటంవల్ల ఇబ్బందులకు గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం.
 
మీనం :- లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నూతన పరిచయా లేర్పడతాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.