సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-01-2024 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

astro3
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ సప్తమి తె.3.09 ఉత్తరాభాద్ర ఉ.9.55 రా.వ.9.11 ల 10.41. పదు. 11. 43 ల 12.26.
లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- ఉద్యోగస్తులు అధికారుల తీరుకు అనుగాణంగా మెలగాలి. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, నిరుత్సాహం ఎదుర్కుంటారు. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో సఖ్యత నెలకొంటుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఆలయ సందర్శనాలలో హడావుడి, తొందరపాటు తగదు.
 
వృషభం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ప్రతి విషయంలోను స్త్రీలదే పైచేయిగా ఉంటుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి తోటివారి వల్ల చికాకులు తప్పవు. షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.
 
మిథునం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, బేకరీ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు సెలవు దొరకటం కష్టమే. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రతి విషయంలోను స్త్రీలదే పైచేయిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడిఅధికం. 
 
కర్కాటకం :- ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలలోని అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో అవస్థలు తప్పవు. మిమ్ములను పొగిడే వ్యక్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు.
 
సింహం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు లీవు, అడ్వాన్స్‌లు మంజూరవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
 
కన్య :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. బిల్లులు చెల్లిస్తారు.
 
తుల :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. క్రయవిక్రయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విద్యార్థులు అత్యుత్సాహం అనర్థాలకుదారితీస్తుంది.
 
వృశ్చికం :- కుటుంబలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. బంధువుల రాక పోకల వల్ల ధనం అధికంగా వ్యయం చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు టివి ఛానెళ్ళు, కళాత్మక పోటీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు యాజమాన్యం నుండి ఒత్తిడి అధికం.
 
ధనస్సు :- మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థులు పరస్పరం విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దైవ దర్శనాలు, మొక్కుబడులు అతికష్టం మ్మీద అనుకూలిస్తాయి.
 
మకరం :- చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఉత్తమం. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. ఎంతో కొంత పొదపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీ అంతరంగి, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీల మనోవాంఛలు, అవసరాలు నెరవేరుతాయి.
 
కుంభం :- ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.
 
మీనం :- ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవటం ఉత్తమం. భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. ఖర్చులు అధికమవుతాయి.