1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 22-06-2025 Your Daily Horoscope

22-06-2025 ఆదివారం దినఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది....

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారంలో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏకపక్ష నింయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ తప్పుపట్టువద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా పడతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆలోచనలతో సతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రావలసిన ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పిల్లల ఉన్నత చదువులకు మరింత శ్రమించాలి. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. వ్యాపకాలు అధికమవుతాయి. బంధుమిత్రులతో పట్టింపులు ఎదురవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పంతాలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. మీ జోక్యం అనివార్యం. తొందరపడి హామీలివ్వవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
తర్వాతి కథనం
22-06-2025 నుంచి 28-06-2025 వరకు వార ఫలితాలు