1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
  4. dr raman webdunia telugu astrology

కాలం మీకు అనుకూలంగా ఉంది(వీర వెంకట గణేశ్వర రావు-మండపేట)

dr raman astrology
వీర వెంకట గణేశ్వర రావు-మండపేట: మీరు ఏకాదశి గురువారం సింహలగ్నము, రోహిణి నక్షత్రము, వృషభరాశి నందు జన్మించారు. భార్య స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల మీ భార్య పేరుతో ఏదైనా వ్యాపారం చేసిన శుభం కలుగుతుంది. మనఃకారకుడైన చంద్రుడిని కేతువు పట్టడం వల్ల పట్టుదలతో అనుకున్నది సాధించండి.

కాలం మీకు అనుకూలంగా ఉంది. లక్ష్మీగణపతిని ఆరాధించడం వల్ల మీరు దినదినాభివృద్ధి పొందుతారు. 2006 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2016 నుంచి 2022 వరకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శని మహర్దశ 19 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇవ్వగలదు. ఉద్యానవనాల్లో నేరేడు చెట్టును నాటిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
About Writer
Raman