సంబంధిత వార్తలు
- బీఎస్ఎన్ఎల్ నుంచి హోలీ ధమాకా ... 425 రోజుల వ్యాలిడిటీ
- మీరుండే ఏరియాలో సిగ్నల్ లేదా.. ఏ నెట్వర్క్ అయినా ఉపయోగించుకోండి..
- రూ.20లో ప్రీపెయిడ్ సిమ్ కార్డు యాక్టివ్.. ట్రాయ్ నయా రూల్
- TRAI: సిమ్ కార్డ్ రీఛార్జ్ విషయంలో ట్రాయ్ కొత్త ప్రకటన- రీఛార్జ్ యూజర్లకు గుడ్ ఛాన్స్
- BSNL Rs 91 plan: రీఛార్జ్ చేసుకోకపోయినా 90 రోజుల వరకు యాక్టివ్
రూ.1198 రీచార్జితో యేడాదిపాటు వ్యాలిడిటీ!! ఏ కంపెనీ?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికరమైన ప్లాన్‌లను అందిస్తుంది. తాజాగా అత్యంత చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే వినియోగదారులకు ఈ ప్లాన్‌తో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
వినియోగదారుడికి ఎక్కువ భారంకాకుండా, అందుబుటులో ఉన్న ప్లాన్ వివరాల్లోకి వెళితే... 365 రోజుల ప్లాన్ ధర రూ.1198లు మాత్రమే. దీని ప్రకారం నెలవారి సగటు ఖర్చు వంద రూపాయలు మాత్రమే అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకుంటే వినియోగదారులక ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది.
ప్రతి నెల 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కు అయినా కాలింగ్ సదుపాయంతో పాటు ప్రతి నెల 30 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ప్రతి నెలా 3జీబీ హైస్పీడ్ డేటా లభిస్తాయి. అంతేకాకుండా, దేశం అంతటా రోగింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతాయి.
