సంబంధిత వార్తలు
- Silver Prices: వెండి ధరలకు రెక్కలు.. 13 సంవత్సరాల తర్వాత గరిష్ఠ స్థాయికి సిల్వర్
- Akshaya Tritiya- అక్షయ తృతీయ: బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం
- Gold Prices: ఈ వారంలో రూ.లక్ష మార్కును దాటిన బంగారం ధరలు.. శుక్రవారం తగ్గి..?
- ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు.. లక్షను తాకనున్న పసిడి
- మరోసారి పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాదులో రేట్లు ఎంత?
Gold: తగ్గిన బంగారం ధరలు.. లక్ష మార్కు దాటినా కొనక తప్పట్లేదు
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ శుభకార్యాలకు బంగారం కొనడం తప్పనిసరిగా మారింది. లక్ష మార్కు దాటిన బంగారం ధర ఇటీవల తగ్గుతూ పెరుగుతూ జనాల్లో ఆశపుట్టిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు నేడు తగ్గాయి.
శుక్రవారంతో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.99,590 లు,22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.91,290 లు, 8 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.74,690 లుగా ఉంది. ఈ ధర సాయంత్రానికి మరింత పెరగడం లేదా తగ్గడం జరగొచ్చు.
ఇక వెండిధరలు కూడా బంగారంతో పోటీ పడుతూ పెరుగుతూనే ఉన్నాయి. మే నెల చివరి వారం వరకు వెండి ధరలు తగ్గుదల నమోదు చేసుకోగా, జూన్ ప్రారంభం నుంచి వెండి ధరలు మరింత పెరుగుతున్నాయి
