1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. New highly-mutated Covid variant has put researchers on high alert

BA.2.86 కోవిడ్ వేరియంట్‌.. ఆ నాలుగు దేశాల్లో తొంగిచూస్తోంది..

corona visus
BA.2.86 కోవిడ్ వేరియంట్‌తో జాగ్రత్తగా వుండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కొత్త వేరియంట్ ఇజ్రాయెల్, డెన్మార్క్, యూకే, అమెరికా నాలుగు దేశాల్లో తొంగి చూస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పర్యవేక్షణలో BA.2.86ని వేరియంట్‌గా గుర్తించడం జరిగింది. 
 
భారతదేశంలో, SARS-CoV-2 వైరస్ కొన్ని కొత్త వేరియంట్‌లను గుర్తించిన నేపథ్యంలో, ఈ వారం ప్రారంభంలో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సీనియర్ అధికారులు పరిస్థితిని సమీక్షించడానికి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇది ఓమిక్రాన్ వేవ్ లాగా ఉండదని అనుకోవడానికి మంచి కారణం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
దీర్ఘకాలిక SARS-CoV-2 ఇన్ఫెక్షన్‌లు ఉన్నవారిలో పెద్ద సంఖ్యలో స్పైక్ మ్యుటేషన్‌లు గమనించబడ్డాయి. "ఈ కారణంగా, మునుపటి ఇన్‌ఫెక్షన్‌లు, వ్యాక్సిన్ బూస్టర్‌ల ద్వారా ప్రేరేపించబడిన కొన్ని న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ నుండి వేరియంట్ తప్పించుకోగలిగే మంచి అవకాశం ఉంది" అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
చంద్రయాన్-3 జైత్రయాత్ర.. భావోద్వేగంలో ఇస్రో శాస్త్రవేత్తలు