1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Extramarital affairs that took lives, Including Woman Cop in Adluru Lake

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..! (Video)

deadbody
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. మహిళా కానిస్టేబుల్ శృతికి, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయి కుమార్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే నిఖిల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఈ ముగ్గురు అడ్లూరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మూడు మృతదేహాలను గుజ ఈతగాళ్లు గురువారం వెలికి తీశారు. 
 
కానిస్టేబుల్ శృతితో ఎస్ఐ సాయికుమార్ వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. ఎస్సైకి, కానిస్టేబుల్ శృతికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎస్ఐ సాయికుమార్‌కు పెళ్లయి ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. కాగా, శృతికి పెళ్లయి విడాకులు అయినట్లు తెలుస్తోంది. 

 
తర్వాతి కథనం
కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)