శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:28 IST)

భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే.. భర్త వీడియో తీశాడు..?

భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయిన ఆమె భర్త దాన్ని వీడియో తీసిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంచలయ్య, కొండమ్మ దంపతులు. కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
 
కొండమ్మ తన భర్త ముందే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె భర్త పెంచలయ్య దాన్ని అపకుండా అదంతా వీడియో తీశాడు. అనంతరం వాట్సాప్‌లో ఆ కుటుంబ సభ్యులకు పంపాడు. 
 
దాంతో పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది.