గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:45 IST)

శిఖా చౌదరికి రెండు పెళ్లిళ్లు.. మేనమామతో శారీరక సాన్నిత్యం.. మామూలు మనిషి కాదు..

కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఈ కేసులో శిఖా చౌదరి అనే మహిళ ఎవరు.. ఆమెకు జయరామ్‌కు ఏంటి సంబంధం అనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి.


తాజాగా శిఖా చౌదరి ఎవరు.. ఆమె అసలు పేరు ఏంటి..? ఆమెకు భారీ ఆస్తులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరి పేరు బాగానే వినిపిస్తోంది. శిఖా చౌదరి పదేళ్ల క్రితం మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. 
 
కానీ ఆ అమ్మాయి ప్రస్తుతం 16 కంపెనీలకు డైరక్టర్. శిఖా చౌదరి అసలు పేరు పులివర్తి మాధురి. ఇప్పుడు పలు కంపెనీలకు డైరక్టర్‌గా మారిన ఆ అమ్మాయి పేరు శిఖా చౌదరి. ఈ ఇద్దరూ ఒక్కరే. పులివర్తి మాధురి.. శిఖా చౌదరిగా మారినందుకు కారణం హైఫై లైఫేనని తెలిసింది. అందుకే ఆమె నేరాల వైపు దృష్టి పెట్టింది. ఏం చేసైనా డబ్బు సంపాదించేయాలని శిఖా చౌదరి డిసైడ్ చేసుకుంది. కొత్త సంవత్సరం పుట్టిన కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య సంచలనం సృష్టించింది. 
 
వందల కోట్లతో బిజినెస్ నడిపిస్తున్న బిజినెస్ మాగ్నెట్ అయిన జయరామ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తుకు దిగిన పోలీసులకు షాకిచ్చే పలు అంశాలు తెలియవచ్చాయి. రోడ్డు పక్కన నిల్చున్న కారులో జయరామ్ మృతదేహం కనిపించింది. జయరామ్‌ది హత్య, ప్రమాదమా లేకుంటే ఆత్మహత్య అనే తేల్చేందుకు పోలీసులు ఎక్కువ సమయం తీసుకోలేదు. జల్సాలకు అలవాటు పడి నేరాలకు దిగే వారు.. ఇలానే వుంటారని.. జయరామ్ హత్య కేసు లోకానికి తెలియజేసింది. అలా జయరామ్‌ది హత్యేనని పోలీసులు తేల్చారు. 
 
ఈ కేసులో ముందు వినిపించిన పేరు శిఖా చౌదరి. ఈమె జయరామ్ మేనకోడలు. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన జయరామ్ కింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన చెల్లెలు భారత్‌లోనే వున్నారు. కానీ జయరామ్ భార్యాపిల్లలు మాత్రం అమెరికాలోనే సెటిల్ అయ్యారు. జయరామ్ చెల్లెలు కూతురే శిఖాచౌదరి. ఈమె అసలు పేరు పులివర్తి మాధురి. ఈమె ఎంబీఐ వరకు చదువుకుంది. ఆమె యుక్త వయస్సులో వుండగానే అనారోగ్యంతో తండ్రి మరణించారు. దీంతో మేనమామ దగ్గరుండి పెళ్లి చేయించారు. 
 
కానీ హైఫై లైఫ్, జల్సాలకు అలవాటు పడిన మాధురి తన భర్తకు దూరంగా వుండటం మొదలెట్టింది. మొదటి పెళ్లి విడాకులు అయ్యాక.. మాధురిలో మార్పు వస్తుందని రెండో పెళ్లి కూడా చేశారు. కానీ రెండో భర్తతో కాపురం చేసేందుకు కూడా మాధురి ఇష్టపడలేదు. హైదరాబాదులో హైఫై లైఫ్ కోసం పాకులాడేది మాధురి. ఈ క్రమంలో చిగురుపాటి జయరామ్ విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారు. అమెరికాలో భార్యతో సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ఆయన తన పిల్లల్ని అక్కడే వుంచేశారు.
 
ఇండియా వచ్చాక చెల్లెలి కుమార్తెను చేరదీశారు. వ్యాపారాలు మొదలుపెట్టారు. యూఎస్‌లో భార్యతో అటాచ్‌మెంట్ లేకపోవడంతో.. దాన్ని గ్రహించిన శిఖా చౌదరి ఆయన అవసరాన్ని క్యాచ్ చేసుకుంది. అప్పుడే మాధురికి జయరామ్ ఖరీదైన వస్తువులు కొనిస్తూ వచ్చేవాడు. దీంతో మాధురి జయరామ్‌ను తన వలలో వేసుకుంది. ఫలితంగా తన కంపెనీల్లోని కీలక బాధ్యతలను జయరామ్ మాధురీకి అప్పగించారు. ఇలా మాధురి కాస్త శిఖా చౌదరిగా మారిపోయింది. 
 
అయితే శిఖా చౌదరి అంతటితో ఆగకుండా మేనమామ వందల కోట్ల ఆస్తిపై శిఖా చౌదరి కన్నేసింది. జయరామ్ కంపెనీలన్నింటినీ తన చేతిలోకి తీసుకున్న శిఖాచౌదరి కోసం రెండు ఇళ్లు కొనిచ్చాడు జయరామ్. ఆమెతో శారీరక సాన్నిత్యం వుండటంతో శిఖా చౌదరి కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడే వాడు కాదు. శిఖా సోదరి మనీషాకు కూడా భారీగా డబ్బు వెచ్చించి.. మెడిసన్ సీటు తీసిచ్చారు జయరామ్. దీన్ని గమనించిన జయరామ్ భార్య పద్మ.. ఆస్తులన్నింటినీ తన పేరుపై రాసుకున్నారు. కానీ భారత్‌లోని కొన్ని ఆస్తులు శిఖా చౌదరి చేతుల్లోనే వుండిపోయాయి. కానీ పద్మ శ్రీ అమెరికా నుంచే భారత్‌లోని తమ సంస్థల చెల్లింపులు చేపట్టారు. 
 
కంపెనీ వ్యవహారాలను చూసుకున్నారు. దీంతో జయరామ్ చేతిలో డబ్బు రాకడ తగ్గింది. ఇది గమనించిన శిఖా చౌదరి జయరామ్‌ను తప్పుదారి పట్టించింది. భారీగా అప్పులు పడేలా చేసింది. రెండేళ్ల మెదక్‌లోకి టెక్ట్రాన్ కంపెనీలోని కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని రంగంలోకి దించింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో వున్న జయరామ్‌కు నాలుగు కోట్లకు పైగా మొత్తాన్ని అప్పుగా తీసిచ్చింది శిఖా చౌదరి. అంతేగాకుండా జయరామ్‌ను పక్కనబెట్టేసిన శిఖా చౌదరి.. రాకేష్ రెడ్డి బ్యాక్రౌండ్ బాగుండటంతో అతనితో కలిసి తిరగడం మొదలెట్టింది. రాకేష్ రెడ్డి ఈ క్రమంలో శిఖా చౌదరితో డేటింగ్ చేశాడు. ఇద్దరూ దుబాయ్ వంటి ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేశారు. 
 
రాకేష్‌తో జల్సాల కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టించింది శిఖా చౌదరి. కానీ రాకేష్ శిఖా చౌదరిని గురించి తెలుసుకుని.. ఆమె తనను వాడుకుంటుందని పక్కనబెట్టాడు. అంతేగాకుండా తన వద్ద తీసుకున్న అప్పుతో పాటు శిఖా చౌదరి జల్సాల కోసం వాడిన కోటిని కూడా వడ్డీతో ఇవ్వాలని జయరామ్‌ను అడిగాడు. అందుకు జయరామ్ కూడా ఓకే చెప్పాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయాడు. దీంతో పక్కా ప్లాన్‌గా జయరామ్‌ను ఇంటికి రప్పించిన రాకేష్ అతడిపై దాడి చేసి ఆయన కారులోనే వుంచి నందిగామ రోడ్డుపై వదిలేశాడు. రాకేష్, జయరామ్‌కు తర్వాత కూడా శిఖా చౌదరి మిన్నకుండలేదు. 
 
జయరామ్ హత్యకు ముందు శ్రీకాంత్ అనే వ్యక్తితో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లింది. డబ్బు కోసం శిఖా చౌదరి మానవ సంబంధాలను మంట గలిపింది. జయరామ్ హత్యకు గురైనప్పటికీ పట్టించుకోకుండా ఆయన ఇంటికి వెళ్లి పత్రాలు సరిచూసుకుంది. మేనమామ మరణించినా.. శిఖాచౌదరి డబ్బుకు ఇచ్చిన గౌరవం దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక జయరామ్ హత్య కేసు శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆధారాలను బట్టి ఆమెకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చివుండవచ్చు. కానీ జయరామ్ హత్యకు శిఖా చౌదరినే కారణం. 
 
డబ్బుకోసం జయరామ్‌ను ఆపై రాకేష్‌ను వాడుకుంది. ఈ నేరంతో శిఖాకు సంబంధం లేకపోవచ్చు. కానీ ఈ నేరం జరగడానికి శిఖా చౌదరినే మూలకారణం. హైఫై కోసం, జల్సా సుఖాల కోసం దారితప్పిన శిఖా చౌదరి యువతకు హెచ్చరింపులాంటిది. మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కష్టపడాలి. కానీ శిఖా లాంటి వారు.. అడ్డదారిలో.. తప్పు చేసి.. డబ్బులు సంపాదిస్తున్నారు. 
 
కానీ వారు చేసే చిన్న చిన్న తప్పులు నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. ఇందుకు హైదరాబాదులో జరిగిన ఎన్నో కేసులను ఉదాహరణగా చెప్పవచ్చు. జీవితంలో ఉన్నదానితో సంతృప్తి చెందకుండా లేనిదాని కోసం పాకులాడి.. అడ్డదారిలో అడుగులేసి అక్రమ సంబంధాలకు తావిస్తే చివరికి మిగిలేది కన్నీరే అనేందుకు ఎన్నో నేరాలు అద్దం పడుతున్నాయి.