సంబంధిత వార్తలు
- శిఖా చౌదరి నన్ను బాగా వాడుకుంది... దుబాయ్ తీస్కెళ్లి... ప్రియుడు రాకేష్
- వెన్నుపోటుతో చనిపోయిన ఎన్టీఆర్ మళ్లీ పుట్టారు - లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్
- విజయదశమికి లక్ష్మీస్ ఎన్టీఆర్.. శ్రీవారి పాదాలచెంత..?: వర్మ
- రూ.3 కోట్లకు సిద్ధపడ్డా.. రూ.కోటి ఖర్చుచేసి ప్రణయ్‌ని లేకుండా చేస్తా : మారుతిరావు శపథం
- విశ్వరూపం-2 సినిమా గురించి నిజాలు తెలిస్తే ప్రేక్షకులు షాకే...
హీరోయిన్‌తో వ్యభిచారం.. రాకేష్ రెడ్డి లీలలెన్నో...
ఎన్నారై జయరామ్ హత్య కేసులో ప్రధాననిందితుడైన రాకేష్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భూదందాలు, ఎమ్మెల్యేల పేరుతో పరిశ్రమలు, వ్యాపారాల యజమానులకు బెదిరింపులు, వీవీఐపీలతో పరిచయాలు, హైటెక్ వ్యభిచారం.. రాకేష్ చౌదరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
ఇతని గత చరిత్రను పరిశీలిస్తే, ఇంటర్మీడియట్ వరకూ చదివిన రాకేశ్.. జీడిమెట్ల సబ్‌స్టేషన్ వద్ద వినాయకుడిని పెట్టి హంగామా చేసేవాడు. టీడీపీలో చేరి యూత్ లీడర్‌గా కొనసాగాడు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఒక రాజకీయ నాయకుడిని 2009లో బెదిరించి రూ.20 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఒక కాంగ్రెస్ నాయకురాలి కుమారుడికి దగ్గరై పోలీసులతోనూ పరిచయాలు పెంచుకున్నాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, మాదాపూర్ ప్రాంతాలు అతడి కార్యస్థావరాలు.
ముఖ్యంగా, రాజకీయ నేతలు, పోలీసులతో పరిచయాలు పెంచుకుని పారిశ్రామికవేత్తలు, వీఐపీలకు అమ్మాయిలను ఎరవేయడం, ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు గుంజడం ఇతడి నేరశైలిగా మారింది. ఆ డబ్బుతో గోవాలాంటి ప్రదేశాలకు వెళ్లి జూదం ఆడుతూ, అమ్మాయిలతో తిరిగేవాడు. అలాగే.. తానొక ఎమ్మెల్యే కొడుకునని చెప్పుకొంటూ రాకేశ్ రెడ్డి ఒక ప్రముఖ హీరోయిన్‌ను వ్యభిచార ఊబిలోకి దింపాడు.
ఓ సినీనటితో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కాగా.. కొన్నాళ్ల క్రితం ఒక పబ్‌లో శిఖాచౌదరికి రాకేశ్‌తో పరిచయమైంది. ఆమే అతణ్ని జయరామ్‌కు పరిచయం చేసినట్లు సమాచారం. జీడిమెట్ల షాపూర్‌నగర్‌లోని హెచ్‌ఎంటీ సొసైటీకి చెందిన కాంగ్రెస్ యువనేత ఒకరితో కలిసి జయరామ్‌ను చంపేందుకు నెలరోజుల క్రితమే రాకేశ్ రెడ్డి కుట్ర పన్నాడని.. వారి ప్రణాళిక ఫలించలేదని తెలుస్తోంది.
