సి.సి. కెమెరా ఆపి చంద్రబాబు, భువనేశ్వరిలు నగలు ఎత్తుకెళ్ళారు.. రోజా  
                                       
                  
                  				  తిరుపతిలోని గోవిందరాజస్వామి కిరీటాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. స్వామివారికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా మూడు రోజులవుతున్నా ఇంతవరకు నిందితులు ఎవరన్న విషయాన్ని గుర్తించలేకపోయారు పోలీసులు. సి.సి. కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులు ఎవరన్న విషయం పోలీసులు సవాల్‌గా మారింది.
				  											
																													
									  
	 
	ఈ కేసు ఇలా జరుగుతుండగానే దీనిపై రాజకీయ రంగు పులుముతున్నారు రాజకీయ నేతలు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిలు సి.సి. ఫుటేజ్‌ను గోవిందరాజస్వామి ఆలయంలో ఆపి కిరీటాలను ఎత్తుకెళ్ళారని ఆరోపించారు. శ్రీవారి ఆస్తులను కూడా ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని, పసుపు - కుంకుమ పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.